Tuesday, May 22, 2007

ఉద్యోగ పర్వం మధ్యలో

ఏ ఉద్యోగంలోనూ శాటిస్ ఫాక్షన్ ఉండడంలేదు. రెండేళ్ళలో నాలుగు ఉద్యోగాలు మారా! అయినా పరిస్థితిలో మార్పులేదు! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!
చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధంలేదు. ఇండియాలో ఉపాధి కరవైన వేళ, అమెరికాలో జాబనగానే ఎగిరి గంతేసి వచ్చింది నేనే! మొదటి అయిదేళ్ళు ఆలోచించే తీరిక లేకుండా, అంతా ఆహా ఓహో అన్నట్లు గడిచింది. అక్కణ్ణుంచి ఎన్నాళ్ళిలా అంటూ మొదలై...ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మరో రెండేళ్ళు, ఇంకా ఒకే కంపెనీలో కూర్చుంటే లాభం లేదని వేట మొడలెట్టా.
కంపెనీ మారినా, టైటిల్ మారినా ... మనిషి మారలేదు, ఆటని ... అన్నట్లు చేసే పని పెద్దగా మారలేదు.
మళ్ళీ వెదుకులాట, మరో కొలువు! మరో కొలువు...మరో కొలువు!
ఉదయం మా పక్కింటావిడ కనిపించి...మళ్ళీ ఉద్యోగం మారావటగా కంగ్రాట్సని వూరుకోకుండా, నీకు వెంట వెంటనే భలే ఉద్యోగాలు దొరుకుతున్నాయే అని ఆశ్చర్య పోయింది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న సామెత గుర్తొచ్చింది.
పై మెట్టు ఎక్కే స్కిల్స్, అనుభవం ఉన్నా, అవకాశపు నిచ్చెన అగుపించడంలేదు.
ఇదే మాట ఒక ఫ్రెండ్ తో అంటే, నువ్వు కుదురుగా ఒక చోట పనిచేస్తేగా ఎగప్రాకే అవకాశమొచ్చేది అన్నాడు! ఇంకెవరైనా ఆ మాట చెబితే, నిజమో కాదో కాస్తన్నా ఆలోచించే వాణ్ణి! మిత్రుడు, ఎనిమిదేళ్ళుగా ఒకే కంపెనీలో...మారని జాబ్ టైటిల్ తో పని చేస్తూ ఉన్నాడు.
అలా అని నా స్కిల్స్ లోనో, నా ప్రయత్నాల్లోనో లోపం లేదని కాదు! ఉంటే ఉండొచ్చు అని ఆలోచిస్తూ పోతే, నా కేమి కావాలో నేనే ఇథమిద్దంగా తెలుసుకోక పోవడం ప్రధాన ప్రతిబంధకంగా కనిపించింది, మిగిలిన లోపాలు ఒకటీ అరా ఉన్నా!

ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు, నేనున్న పరిస్థితుల్లో ఇంకా కొందరున్నారనిపించింది.
ఈ సమస్యకు పరిష్కారం - ఇండియా వెళ్ళి అక్కడ ఉద్యోగం వెదుక్కోవడమేనని కొందరి అభిప్రాయం! అదెంత వరకు ఉపయోగిస్తుందీ అని ప్రస్తుతపు నా ఆలోచన!

4 comments:

venkat said...

naadi ade baadha...kaani eppatikaina sinimaalu tiyaalanna naa pattudala nanni udyogam gurimchi marchipoyelaa chestundhi...
venkat
www.24fps.co.in

Hima said...

That is very good decition

రానారె said...

కుదురుగా ఉండలేకపోవడమనే నైజం సులువుగా మారదని నా అభిప్రాయం. చేసే పనిలో ఆనందాన్ని వెతకడమో లేక ఆనందం కలిగించే పనిచేయడమో దీనికి పరిష్కారం కావచ్చునేమో. అదికూడా అసలేంచేయాలనుకుంటున్నామో మనకు మనం సరిగ్గా తెలుసుకున్నాకే. అంతవరకూ ఎక్కడికెళ్లినా ఎక్కేగడప దిగేగడపే.

leo said...

Please post it if you found a way out. Me too in the same boat.