సీసాలు, కందాలు అయినంత మాత్రాన కవితామయమైపోవు కదా, అన్నీ!
ఎక్కడో చడివిన ఈ క్రింది లైనులు చూడండి:
అప్పి కట్లకు బాపట్ల అయిదు మైళ్ళు (తేటగీతి ఛందస్సులో ఒడిగే పాదం).
ఆంధ్ర పత్రిక ఇచ్చట అమ్మబడును (మరో తేటగీతి పద్య పాదం).
గణాలు సరిగ్గా సరిపోయాయి. యతి స్థానం చక్కగా కుదిరింది. అర్తమున్న వాక్యమే అవతరించింది (నా దృష్ఠిలో అర్థమున్న వాక్యం).
కానీ అలా మూసలో అచ్చొత్తినంత మాత్రాన పదాలు కవిత్వపు స్థాయికెళతాయా?
ఒక అనుభవాన్నో, ఒక సత్యాన్నో - అనుభవించిన వాడు, శోధించిన వాడు... ఆ ఉద్విగ్న తరంగాలను తనలో దాచుకోలేక, పసి పాపలా కేరింతలు కొడుతూ, చుట్టూ వున్న వాళ్ళతో పంచుకోవాలనుకుని, అందుకు కవిత్వాన్ని వాహకంగా ఎంచుకుంటాడు.
చుట్టూ ఉన్న వాళ్ళలో కొందరు ఆ భావతరంగాలకనుగుణంగా స్పందిస్తారు. కొందరు 'ఇదేమి గొడవ' అంటూ ప్రక్కకు తప్పుకుంటారు. మరికొందరు 'నీ ఆవేశాన్ని అలాకాదు వ్యక్తంచేసేది. ఆ చేతుల్ని ఇంకాస్త పైకెత్తు. స్వరంలో గమకం పెంచు. కాళ్ళను ఇంకాస్త వొంచు. భoగిమ కొంచెం మార్చు...అద్గదీ...అలా వ్యక్తం చేయాలి' అంటూ సలహాలు మొదలెడతారు.
అలా అనుభవాన్ని ఇలా మాత్రమే, ఈ పరిధుల్లోనే, ఈ సూత్రాలకు లోబడే అభివ్యక్తీకరించాలి అని శాసించడం అంత సబబు కాదు అనిపిస్తుంది నాకు. కానీ, అర్హత గల వాళ్ళు - పదాల సమూహం కళ స్థాయిని అందుకునేందుకు ఉపయోగపడే సలహాలివ్వడం వల్ల కవికి కవిత్వానికి మేలు జరుగుతుందని నా నమ్మకం.
కట్టుబాటులను కాదనక, సంప్రదాయానికి తల ఒగ్గి అందరూ వ్రాసి ఉంటే మనకొక గురజాడ, శ్రీశ్రీ, తిలక్, ఇస్మాయిల్, అజంతా, మో లాంటి కవులు ఇప్పుడున్న రూపాల్లో దొరికేవారా? సందేహమే!
ఇకపోతే - నినాదాలు, పేలవమైన నిర్మాణాలు, స్పష్టత లేక పోవడం (క్లిష్టత కాదు!) ఈ మధ్య వొస్తున్న కవిత్వంలో కొట్టొచ్చినట్లు కనిపించే లోపాలు(కొన్నింటికి మినహాయింపులు ఉండొచ్చు).
ఒక భావం/అనుభూతి కవితగా రూపం పోసుకుని - పాఠకుడిలో/శ్రోతలో రస స్పందన కలగజేస్తే (కవి అనుభవించిన స్థాయిలో కాకున్నా సరే)-ఆ రచన కవిత్వంగాను, కళ గాను మారినట్లేనని నేననుకుంటాను.
పద్యాల బాటన నడుస్తున్న కవితా రధాన్ని, మాత్రా ఛందస్సుల గేయ మార్గంలోకి...అక్కణ్ణుంచీ వచనంలోకీ మళ్ళించి ఎందరి మెప్పునో పొందిన మన ప్రియతమ కవులే, ఈ నాటి కవిత్వ స్థితికి పరోక్షంగా కారకులేమోనని పిస్తుంది!
అన్ని రోజులూ ఒకేలా వుండవు కదా! మన తెలుగు కవిత్వానికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశ!
Wednesday, May 23, 2007
Subscribe to:
Post Comments (Atom)


4 comments:
మీరు చెప్పింది అక్షర సత్యం.చాలా మంచి వ్యాసం.కవిత్వాన్ని బ్రష్టుపట్టిస్తున్న వాళ్ళలో నేనుకూడా వున్నాను.కానీ ఏమి చేయలేను.నా ఆనందాలు,ఆలోచనలకు,అభిప్రాయాలకు అంతకన్న ఎక్కువగా అక్షర భాష్యం చెప్పలేకపోతున్నాను.అందుకే వాటిని నేను కవితలు అనుకోను.జస్ట్ భావాలకు రూపం మాత్రమే.
రాధిక -
మీ బ్లాగును చూస్తుంటాను నేను.
మీరు మీ భావాలను కవితాత్మకంగా చాలా చక్కగా చెబుతున్నారు,
Pls write more!
Regatds,
సిరి
తప్పకుండా వస్తాయి.
"అప్పి కట్లకు బాపట్ల అయిదు మైళ్ళు
ఆంధ్ర పత్రిక ఇచ్చట అమ్మబడును"
Hilarious!!
Post a Comment