Thursday, June 28, 2007

కేసులు ఏమవుతాయి?

'పవన్ కళ్యాణ్ మీద కేసు ఏమవుతుందనుకుంటున్నారు?' అనడిగారొక పెద్దాయన!
అమాయకత్వానికి హద్దులుండవా అనిపించింది, ఆయన వాలకం చూసి.

ముఖ్యమంత్రి గారి మీద పాల్ కేసు పెట్టారు. అదేమౌతుంది? (అసలక్కడ కేసే లేదన్నది వేరే సంగతి!)
మార్గదర్శి మీద కొన్ని నెలల క్రితం పెద్ద దుమారం లేచింది. ఇంకేముందు కొండ కుదేలవుతుందన్నారు...చివరకు ఏమైంది? అలాగే బాలకృష్ణ గారి మీది షూటింగ్ (సినిమా షూటింగ్ కాదని మనవి!) కేసూ ఒక వారం రోజులు మాంచి యాక్షన్ కాలక్షేపాన్నిచ్చి, సాక్ష్యాలు లేక తుస్సుమనలేదూ?!

'పవన్ కళ్యాణ్ కేసు ఏమవుతుందో వేరుగా చెప్పాలా?' అని ఎదురు ప్రశ్న వేశా. ఏమవుతుందో తెలియదని ఒప్పుకోలేక!
సెలబ్రిటీలను చూస్తే అందరికీ లోకువే! అయిన దానికీ కాని దానికి కేసులు పెట్టి హడావిడి చేస్తుంటారు. టీవీలు, సినిమాలు చూసి చూసి విసుగెత్తుతున్న సమయంలో...ఇలాంటి ఎపిసోడులు లేక పోతే జనమేమైపోతారో!

'ఈ కేసు నేపధ్యంలో, చిరంజీవి భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావొచ్చుననుకుంటున్నారట కదా?' అడిగారా పెద్దాయన మళ్ళీ.
'అబ్బే చిరంజీవి గారింకా ఆ విషయం నాతో చెప్పలేదండీ' అంటూండగానే, నన్ను రక్షించడానికి నా సెల్ ఫోన్ మ్రోగింది.
ఫోన్ చేసింది చిరంజీవి గారు కాదు!

7 comments:

ssv said...

కేసులేమవుతాయి ?? కొందరి అధికారుల ఇళ్ళలో సూట్ కేసులవుతాయి. మనోహర్ లాంటి చిన్న (స్టేచరు) హంతకులకి శిక్ష తప్పదు. ఇంకొద్దిగా పెద్ద వాళ్ళు అయితే, టీ. వీ. ఇంటర్వ్యూ లు కూడా. కృష్ణుడి బావ కళ్లళ్ళో రిన్ లాగా తళ తళ లాడే మెరుపులు చూడాలని. వీరి కంటే పెద్ద వాళ్ళకి వెంటనే గుండెనొప్పి, డిప్రెషన్ లాటి మహమ్మారి (మాయలమారి??) జబ్బులు వస్తాయి. కేసు కొట్టి వేయగానే, కధ మళ్ళా మాములే. ఇక సదరు షూటింగ్ చుక్క విషయమంటారా ? ఇప్పుడు ఎత్తక పోవడమే మంచిది. మాంచి పాజిటివ్ మైండ్ సెట్, నీతి నిజాయితీ మారు పేరయిన రాజకీయ నాయకునికి బంధువు అవుతున్నాడు మరి. తనకు ఎమన్నా జరిగితే, అభిమానులు ఎలాగు ఉండనే ఉన్నారు మీడియా కి తగిన మసాలా ఇచ్చేందుకు. రేప్పొద్దున తను మంత్రి అయినా ఆశ్చర్య పోవాలసిన విషయమేమి లేదు. మన ప్రజలు దేనినైనా సహిస్తారు కాని, తమ కులం వాడు, తమ అభిమాన నటుడు తగిన పదవి పొందక పోతే మాత్రం ఊరుకోరు

Disclaimer: These are absolutely my opinions. Original author of the above blog has nothing to do with my opinions.

ప్రసాద్ said...

అంతేమరి ముంజేతి కంకణానికి అద్దమెందుకని, ఇంత స్పష్టంగా మంది బలం, డబ్బు బలం, కుల బలం వున్నవాన్ని ఎవరూ ఏమీ పీకలేరు. రాజ్యం వీర భొజ్యం అన్నది అక్షరాలా ఇప్పుడు అమలవుతున్న రోజుల్లో చివరికి జరిగేదేమిటో తెలిసిందే.

--ప్రసాద్
http://blog.charasala.com

Ramesh Juvvi said...

రాజ్యం వీరభోజ్యమో ఏమో కానీ - ఈ సమకాలీన రాజ్యం మటుకు గూండా రాజ్యం, పిండాకూళ్ళు తినే మాలకాకుల రాజ్యం.బలవంతుడిదే అధికారం అయితే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు - విస్తరాకులో తొంగోబెట్టి చూడాటనికి కూడ అసహ్యం వేసే గజ్జి కుక్కల్లాంటి ఈ రాజకీయ ము.కొ లతొ చింపి పారేసారు.మంచోడు ఒకడు ఉంటే వాడిని చావగొట్టి చెవులు మూసేదాకా మన సంఘం ఊరుకోదు కదా.సంఘాం లోని చెడుని ప్రజలు ఆస్వాదిస్తూ ఉంటే, దాని పర్యవసనాలను అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండండి దరిద్రపు సమాజపు పీనుగుల్లారా.కొన్ని రోజులకి మీ కూతురికి, చెల్లెలికి కూడా ఇలాంటివి ఎదురవుతాయి అప్పుడు కూడా మనసారా నవ్వుకోండి. పవన్ అయితే ఏంటి, సచిన్ అయితే ఏంటి, కలాం అయితే ఏంటి ఎవరయినా తప్పు చేస్తే బొక్కలో పెట్టి మక్కెలిరగతన్నే బుద్ధి గల పోలీసు రాజ్యం వచ్చినప్పుడే ఈ సంఘం బాగుపడుతుంది.

నేనుసైతం said...

ఇన్ని సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు కేసు వేసారంటే వెనుక ఏదో కనబడని కారణం ఉండిఉండాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహం లో బాగం గా చిరంజీవిని ఒక రకంగా తమ వైపుకు తిప్పుకునే భారీ పధకం లో కాంగ్రెసు వేసిన ఎత్తు అయివుండవచ్చు. ఈ పధకం భాగం లో పవన్ కళ్యాణ్ మరియు నందిని కేవలం పావులు మాత్రమే. (కాంగ్రెసు ఎత్తుగడ ఈ విధం గా వర్క్ అవుతుంది అన్నది, రాజకీయ పరిఙ్నానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది).ఇప్పుడు చిరంజీవి ఈ విధంగా రాజకీయం ప్రవేశం చేస్తారు అన్నది ఈ సంఘటన నుండి ఎలా బయట పడతారు అన్నదాని మీద ఉంటుంది. వచ్చే ఎన్నికలలో కంగ్రెసు కి మద్దతా లేక సొంత పార్టీ నా అన్నది.ఈ రెండిటి లో ఒకటి మాత్రం ఖాయం.
-నేనుసైతం

నేనుసైతం said...

గమనిక:- నా పై కామెంటులో కొన్ని అక్షర దోషాలు ఉన్నయి, అందువలన మళ్ళీ పోస్టు చేసాను. క్షమించగలరు.

ఇన్ని సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు కేసు వేసారంటే వెనుక ఏదో కనబడని కారణం ఉండిఉండాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహం లో బాగంగా చిరంజీవిని ఒక రకంగా తమ వైపుకు తిప్పుకునే భారీ పధకం లో కాంగ్రెసు వేసిన ఎత్తు అయివుండవచ్చు. ఈ పధకం లో పవన్ కళ్యాణ్ మరియు నందిని కేవలం పావులు మాత్రమే. (కాంగ్రెసు ఎత్తుగడ ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది, రాజకీయ పరిఙ్నానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది).ఇప్పుడు చిరంజీవి ఏ విధంగా రాజకీయం ప్రవేశం చేస్తారు అన్నది ఈ సంఘటన నుండి చిరు మరియు ఆయన కుటుంబం ఎలా బయట పడతారు అన్నదాని మీద ఉంటుంది. వచ్చే ఎన్నికలలో కంగ్రెసు కి మద్దతా లేక సొంత పార్టీ నా అన్నది.ఈ రెండిటి లో ఒకటి మాత్రం ఖాయం.
-నేనుసైతం

రానారె said...

కేసులు ఏమైనా అవనివ్వండిగానీ, మీ రాత మాత్రం చాలా షార్ప్‌గా, నవ్వుతెప్పించేలా ఉంది. కాస్త వెనక్కివెళ్తే... తుమ్మితే ఊడే ముక్కు - విషయంలో మీరు సంయమనం పాటించి నాకు బాగా బుద్ధిచెప్పారు. అందుకు మీకు కృతజ్ఞతలు.

సిరి said...

అందరికీ కృతజ్ఞతలు.

రానారె గారు, హా...నా సంయమనం గురించే చెప్పుకోవాలి:-) బుద్ధి చెప్పడం లాంటి పెద్ద మాటలెందుకు. వాటి గురించి మర్చిపోండి. ఈమాటలో మీ కథ చదవాలనుకుంటూ, పనుల్లో సమయం కుదరక వాయిదా వేసుకుంటూ వొస్తున్నా. చదివాక మీకొక ఉత్తరం రాస్తా!