Saturday, July 14, 2007

గాంధీగిరి - గ్రీన్ కార్డ్

(Random thoughts)

ఇప్పటి సినిమాల వల్ల ఇలాంటి మంచి కూడా జరుగుతుందని అందరికీ తెలిసేలా మనవాళ్ళు విదేశాల్లో ప్రవర్తిస్తున్నారంటే ఇది భారత దేశానికే గర్వ కారణం.

మరి ఇలాంటి సమస్యలే ఇండియాలో వస్తే, ఇదే జనాలు ఇలాగే స్పందిస్తారా? అంటే పూలు పంపడంఓ స్వీట్లు పంపడమో చేస్తారా, లేక ఆందోళనకు దిగి - రవాణా సదుపాయాలకు, పౌర జీవనానికి ఆటంకాలు కలిగిస్తారా? కారణాలు ఎలాంటివైనా, 'గాంధీగిరి ' తరహా ఆందోళనలు భారతదేశంలో ఎక్కువ కనిపించవు. అలాగే, అతి మామూలుగా భారతంలో కనిపించే ఆదోళనాపర్వాలు అమెరికాలో కనిపించవు!

ఇంతకీ ఆందోళన ఎందుకు చేస్తున్నట్లు? H1 వీసా కోసం అమెరికా కన్సులేట్లో, 'మీరు మీ H1 అయిపోగానే వెనక్కి వచ్చేస్తారా? ' అనడిగితే, వస్తామనే కదూ అందరూ చెబుతారు. అలాగే చదువుల కోసం వీసాలు అర్థించే వాళ్ళు కూడా! అమెరికాలో కాలు పెట్టాక, ఆశయాలకు తగ్గ అవకాశాలు, జీవనోపాధి మార్గాలు, జీవన ప్రమాణాలు కనిపిస్తాయి. మనసులు మారతాయి. మనుషులు మారతారు. అవసరాలు మారతాయి. నమ్మకాలు మారతాయి. కాస్తోకూస్తో మతిమరపూ వొస్తుంది.

అమెరికాలోనే ఉండి పోదామనుకునే వారికి గ్రీన్ కార్డులు, పౌరసత్వాలూ అవసరమౌతాయి కాలక్రమేణా!

అన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయి కాబట్టి - గ్రీను కార్డులిచ్చే సంప్రదాయం, వాటికి అర్హులు అప్లై చేసుకోవడం, పొందడం - ఎలాంటి ఆక్షేపణాలేదు. కానీ ముందు అప్లై చేసుకోమని తర్వాత వెనక్కి తగ్గడం వల్ల ఎంతో మంది వ్యయప్రాయాసలు వృధా అయినట్లే. నిరసన తెలపవలసిందే! అదీ విధ్వంసాలకు తావులేని నిరసన అన్ని నిరసనల్లోకి శ్రేష్టం!

కాకపోతే అమెరికాలో భారతీయులు పాటించే సంయమనాన్ని, చూపే సహనాన్ని భారత దేశంలో ఎదురయ్యే సమస్యల పట్ల, భారతదేశంలో ప్రజానీకం కూడా చూపగలితే ఎంత బాగుంటుంది?!

4 comments:

radhika said...

మనం అమెరికాలో ప్రవర్తించే తీరు,ఇండియాలో ప్రవర్తించే తీరు ఉత్తర దక్షిణ దృవాల్లా వుంటాయి.అలా ఎందుకు మారిపోతాము అనడానికి కారణం నాకు తెలీదు.సాధారణం గా తెలియని వాల్లు ఏమనుకుంటారో అని మనం చెత్తపనులు చెయ్యడం మానము.తెలిసిన వాళ్ళు వున్నారంటే మంచిగా ప్రవర్తిస్తాము.కానీ విదేశాలు వచ్చినప్పుడు మాత్రం పూర్తి భిన్నం గా ప్రవర్తిస్తాము.ఏమిటో?

VISWANATH said...

అమెరికా లేక యూరోపియన్ దేశాల్లో ఇలాచేస్తే వాళ్ళు సిగ్గుపడి దానిపై రెస్పాండవుతారుగాని ఇండియాలో సిగ్గెవరికుంటుంది సర్.
పంపిస్తూ ఉంటే స్వీట్లు పువ్వులు వద్దుగాని నగా నట్రా,టీవీ ఫ్రిజ్జు లాంటివి పంపించమని చెప్పే దాదాగిరీలే అన్నీ.

VISWANATH said...

అమెరికా లేక యూరోపియన్ దేశాల్లో ఇలాచేస్తే వాళ్ళు సిగ్గుపడి దానిపై రెస్పాండవుతారుగాని ఇండియాలో సిగ్గెవరికుంటుంది సర్.
పంపిస్తూ ఉంటే స్వీట్లు పువ్వులు వద్దుగాని నగా నట్రా,టీవీ ఫ్రిజ్జు లాంటివి పంపించమని చెప్పే దాదాగిరీలే అన్నీ.

ఆసా said...

This is knowns as "Beating at obedience", result depends on with whom you want to show..
If someone you know and don't want to spoil the relation in the longterm , you can do this as it will instigate others to think what is wrong with them, in the worst case it will leave guilty feeling and may not let him do that again.

I tried this successfully in my office , it is more like homeopathy, result will take longertime but a permanent one.

No wonder this is not relevant in this fastfood world.