Monday, April 23, 2007

ఎంకి పెళ్ళి - సుబ్బి చా...

ఐశ్వర్య, అభిషేక్ ల పెళ్ళి గురించి పత్రికల్లో చదివినప్పుఢు, ఎంతలా డబ్బు, పరపతి ఉంటే మాత్రం పెళ్ళిని అంత ఆర్భాటంగా జరుపుకోవాలా అనిపించింది. కొన్ని వెబ్ సైటులైతే, ఈ పెళ్ళిని వెడ్డింగ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణించాయి. క్రొత్త జంట, వాళ్ళ పెద్దలతో దైవ దర్శనానికి తిరుపతి వెళ్ళి, కొన్ని గంటల పాటు మామూలు భక్తుల్ని ఇబ్బందుల పాలు చేశారని పత్రికల్లో చదివి - భారత దేశంలో ఇబ్బందులు లేని బతుకు కేవలం, సినిమాల వాళ్ళకు, రాజకీయులకు...బాగా డబ్బున్న వాళ్ళకేనని మరో సారి అనుకున్నాను. ఎవరైనా పుణ్యాత్ములు సర్వే చేసి - ఇలా ఇబ్బందులకు అతీతులైన వారి సంఖ్యను...ఇబ్బందులు పడే వాళ్ళ సంఖ్యను - ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో బతుకులీడుస్తున్న జనాలకు అర్థమైన రీతిలో, అర్థమయ్యే వరకు చెబితే ఎంత బావుణ్ణు!