తెలుగు బ్లాగుల గురించి ఆలోచిస్తుంటే గురజాడ గారి గిరీశం మాటలు గుర్తొచ్చాయి.
***
కన్యాశుల్కంలో గిరీశం ఇలా చెబుతాడు:
దేవుణ్ణి నిలదీసి, నన్ను డిపెండెంటుగా సృష్టించావా, ఇండిపెండెంటుగా సృష్టించావా అని అడుగుతానంటాడు. డిపెండెంటుగా సృష్టిస్తే తానేమి చేసినా, దేవుని అనుమతితో చేసినట్లే కాబట్టి...పాపపుణ్యాలన్నీ దేవుడి అకౌంట్ లోనే! ఇండిపెండెంటుగా సృష్టిస్తే - తనేమి చేసినా అడిగే అధికారం దేవుడికి లేదని అంటాడు!
***
నేనొక బ్లాగు రాసాను. నేను బ్లాగులు రాస్తోంది ఎవరినీ ఉద్ధరించడానికి కాదని, కేవలం నా కోసమేనని చెప్పుకున్నాను. తర్వాత - వావ్ ... నేను పాతిక టపాలు (లేకపోతే నలభై రెండు, యాభై) రాసేసానని సంబర పడ్డాను! తదుపరి, అయ్యో నా బ్లాగులు చూస్తున్న వాళ్ళెవరూ వ్యాఖ్యానాలు చేయడం లేదే అని ఫీలయ్యాను. అంతటితో వూరుకోకుండా నా బ్లాగు చూసే వాళ్ళతో, వ్యాఖ్యానం రాస్తే నాక్కాస్త ఉత్సాహమొస్తుంది కదా...మరిన్ని టపాలు రాస్తాను కదా అని అన్నాను! తప్పులుంటే దయచేసి చెప్పమని, నిర్మొహమాటంగా అభిప్రాయాలు తెలుపమనీ అడిగాను!
***
బ్లాగ్ దర్శించే వాళ్ళు అది చూసి ఏమనుకున్నారో వ్యాఖ్యానాలు రాయడం మొదలెట్టారు. టపా బాగుందనేవి చదివి చాలా ఆనందించాను. బాగాలేదని రాసినవి చదివి, వీళ్ళిలా ఎందుకు రాసారు...మరీ అలా మొహమాటం లేకుండా బాగాలేదని రాయడమేనా అనుకున్నాను. ఇంకో చిత్రం బాగా లేదని రాసే వాళ్ళు సాధారణంగా పేర్లు వ్రాయరు. బహుశా దానిక్కారణం సంస్కృతికి సంబంధించినదై వుండొచ్చు! దేన్నైనా బాగుందని అంటే అలా అన్నదెవరని పట్టించుకోము. బాగో లేదంటే వెంటనే అలా అన్నదెవడు, ఎక్కడి వాడు, ఏ ఏ ఇతర కారణాల వల్ల అలా అన్నాడు అని పరిశోధన ప్రారంభిస్తాం! అలా అన్నవారి ఉనికి తెలిస్తే, వారినేమైనా చేస్తామా అంటే అదీలేదు!
***
ఇంత చేసినా బ్లాగులు రాస్తున్నది కేవలం నా ఆనందం కోసమేనని మరోసారి నాకు నేను చెప్పుకుంటూ ఉండగా, గురజాడ గారి గిరీశం "నువ్వెందుకు బ్లాగులు రాస్తున్నావ్?"అడిగాడు.
గిరీశాన్ని చూస్తున్నానన్న షాక్ నుంచీ బయటకొచ్చి "నా ఆనందం కోసం" చెప్పాను.
"ఎవరెవరో చదవాలని ఎందుకను కుంటున్నావ్?" అడిగాడు గిరీశం.
"నా ఆనందం కోసం" అన్నాను.
"ఏడ్చినట్లుంది...నీ ఆనందంకోసం నువ్వు రాసుకునే నీ సొంత విషయాలు, ఇంటి విషయాలు, జోకులూ...పద్యాలు మిగిలిన వాళ్ళు అస్సలెందుకు చదవాలి"అడిగాడు.
అది నాకు తెలిసిన గురజాడ గారి గిరీశం గొంతులా లేదు.
"నా అనుభూతుల్ని మిగిలిన వాళ్ళతో పంచుకోడానికి"
"అలాంటప్పుడు నా ఆనందం కోసం రాసుకుంటున్నానని బిల్డప్ ఎందుకు. ఒకవేళ నీ ఆనందం కోసం నువ్వు రాసుకుంటే ఎవరు చదువుతున్నారు ఎవరు చదవడం లేదు అన్నది నీకనవసరం. కామెంట్ల గురించీ, హిట్ల గురించీ పట్టించుకోకు. అలాకాదు, అందరి ఆనందం కోసం రాస్తున్నానంటావూ - అప్పుడు వాళ్ళానందించి ఆ విషయం చెబితే ఆనందంగా విను. బాగాలేదని చెప్పిన విషయాన్నీ అంతే ఆనందంతో విను. అసలేమీ చెప్పకున్నా ఆనందంగా ఉండు. అంతేగానీ, కామెంట్లు రాయడం లేదనీ, బాగుందని రాయడం లేదని వాపోకు. అదీ ఇదీ కాదు లోకాన్ని మరామత్తు చేయడానికి రాస్తున్నానంటావు...అప్పుడు లెక్కలే వేరు. నువ్వు రాసే విషయం గురించి వివరాలు సేకరించి రాయి. ఏదో గుడ్డెద్దు చేలోపడ్డట్టు చేతి కొచ్చిందంతా రాసి, ఆగం ఆగం చేయకు"
ఆయనలా గబగబా చెప్పుకు పోతుంటే నాకు కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు.అర్థం కాలేదన్న ఫీలింగు బయట పడితే, ఇంకా క్లాసు పీకుతాడనిపించింది.
***
తెలుగు బ్లాగ్ ప్రపంచం ఇంకా బాల్యావస్త లోనే ఉంది. పరిణతి పొందిన బ్లాగర్లను వేళ్ళమీద లెక్క పెట్టవొచ్చు. బ్లాగుల్లో స్థాయి పెరిగేది, సమాచారాన్ని, సంస్కృతుల్ని, సమస్యలను విభిన్న కోణాల్లోంచి చూసి...మరిన్ని భిన్న కోణాల్లో చర్చించినప్పుడే!బాగున్నవాటిని ఎందుకు బాగున్నాయో, బాగా లేనివి ఎందుకు బాగోలేవో నిర్మొహమాటంగా(ఆరోగ్యకరమైన వాతావరణంలో అయితే ఇంకా బాగు)చర్చించుకుంటేనే బ్లాగుల ప్రయోజనం నెరవేరుతుంది.
***
ఇది ఏవక్కరినో ఉద్దేశించి వ్రాసినది కాదు. ఏవక్కరినో ఆలోచింపచేయడానికి వ్రాసినది కాదు. ఏవక్కరినో కాదు అంటే...???
***
"ఎదుటి వారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ...." అన్నదెవరు? ఆత్రేయ గారేనా?? నా గురించేనా ఆయనలా వ్రాసింది???
Monday, July 23, 2007
Saturday, July 14, 2007
గాంధీగిరి - గ్రీన్ కార్డ్
(Random thoughts)
ఇప్పటి సినిమాల వల్ల ఇలాంటి మంచి కూడా జరుగుతుందని అందరికీ తెలిసేలా మనవాళ్ళు విదేశాల్లో ప్రవర్తిస్తున్నారంటే ఇది భారత దేశానికే గర్వ కారణం.
మరి ఇలాంటి సమస్యలే ఇండియాలో వస్తే, ఇదే జనాలు ఇలాగే స్పందిస్తారా? అంటే పూలు పంపడంఓ స్వీట్లు పంపడమో చేస్తారా, లేక ఆందోళనకు దిగి - రవాణా సదుపాయాలకు, పౌర జీవనానికి ఆటంకాలు కలిగిస్తారా? కారణాలు ఎలాంటివైనా, 'గాంధీగిరి ' తరహా ఆందోళనలు భారతదేశంలో ఎక్కువ కనిపించవు. అలాగే, అతి మామూలుగా భారతంలో కనిపించే ఆదోళనాపర్వాలు అమెరికాలో కనిపించవు!
ఇంతకీ ఆందోళన ఎందుకు చేస్తున్నట్లు? H1 వీసా కోసం అమెరికా కన్సులేట్లో, 'మీరు మీ H1 అయిపోగానే వెనక్కి వచ్చేస్తారా? ' అనడిగితే, వస్తామనే కదూ అందరూ చెబుతారు. అలాగే చదువుల కోసం వీసాలు అర్థించే వాళ్ళు కూడా! అమెరికాలో కాలు పెట్టాక, ఆశయాలకు తగ్గ అవకాశాలు, జీవనోపాధి మార్గాలు, జీవన ప్రమాణాలు కనిపిస్తాయి. మనసులు మారతాయి. మనుషులు మారతారు. అవసరాలు మారతాయి. నమ్మకాలు మారతాయి. కాస్తోకూస్తో మతిమరపూ వొస్తుంది.
అమెరికాలోనే ఉండి పోదామనుకునే వారికి గ్రీన్ కార్డులు, పౌరసత్వాలూ అవసరమౌతాయి కాలక్రమేణా!
అన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయి కాబట్టి - గ్రీను కార్డులిచ్చే సంప్రదాయం, వాటికి అర్హులు అప్లై చేసుకోవడం, పొందడం - ఎలాంటి ఆక్షేపణాలేదు. కానీ ముందు అప్లై చేసుకోమని తర్వాత వెనక్కి తగ్గడం వల్ల ఎంతో మంది వ్యయప్రాయాసలు వృధా అయినట్లే. నిరసన తెలపవలసిందే! అదీ విధ్వంసాలకు తావులేని నిరసన అన్ని నిరసనల్లోకి శ్రేష్టం!
కాకపోతే అమెరికాలో భారతీయులు పాటించే సంయమనాన్ని, చూపే సహనాన్ని భారత దేశంలో ఎదురయ్యే సమస్యల పట్ల, భారతదేశంలో ప్రజానీకం కూడా చూపగలితే ఎంత బాగుంటుంది?!

Monday, July 2, 2007
610 - చేతి లో గులాబీ
'స్వరాష్ట్రం లోనే స్థానికేతరులమా?' 610 జీవో బాధితుల ప్రశ్న ఆలోచనలు రేకెత్తించేదే (ఈనాడు లో వచ్చిన వార్త)!
గ్లోబలైజేషన్ కాలంలో, ఉపాధి కోసం జనం - ఉత్పత్తి పెంచే వాళ్ళకోసం పెట్టుబడి దారులు - ప్రాంతీయతలను, జాతీయతలను ప్రతి బంధకాలుగా గుర్తించని తరుణంలో - హైటెక్ హవాలో ముందున్నది (ఆంధ్రలోనే కాదు, అమెరికాలోకూడా ) మనమేనని తొడలు చరుచుకునే నాయకులున్న రాష్ట్రంలో ... ఈ జీవో అమలు '(రాజ)క్రీడలో కదళీ ఫలమే'?
ఇరవైయ్యేళ్ళుగా, మూల పారేసిన 610 బయటకు తీసి, ఝళిపిస్తున్నారంటే పెద్ద కారణమే ఉండాలి!
ఏమో, వచ్చే ఎన్నికల్లో అర'చేతి 'లో విరిసిన 'గులాబీ'లతో ఓట్ల కోసం నాయకులు అభ్యర్థిస్తారేమో?! ఆ సన్నివేశానికిది ఒక ఆలంబనేమో?!
రాజకీయాల్లో ఏదైనా సంభవమే కదా!

Subscribe to:
Posts (Atom)