ఈ మధ్య అనుకోకుండా బజారులో ఒక కథా రచయిత [కర] తారసపడ్డాడు.
నాకు కవులంటే చాలా భయం, ప్రత్యేకంగా మా వూరు కవులంటే!
కథలు మాత్రమే వ్రాసే వాళ్ళు కవుల కోవలోకి రారు కాబట్టి, సదరు కర ను నిర్భయంగా పలకరించి, ఈ మధ్య ఏమి వ్రాసారని అడిగా!
కథ పేరు చెప్పి చదివారా అనడిగాడు.
ఆ కథ నేను చదివాను. దాని మీద వచ్చిన అభిప్రాయాలు కూడా చదివాను. ఆ విషయమే 'కర 'కు చెప్పాను.
కర గారు తన కథను చీల్చి చెండాడిన విమర్శకుని మీద కారాలు మిరియాలు నూరడం మొదలెట్టాడు. కథల గురించి ఆ విమర్శకుడికి ఏమీ తెలియదనీ, అసలతడికి కథల గురించి మాట్లాడే అర్హత లేనే లేదనీ అన్నాడు. పైపెచ్చు ఆ విమర్శకుడికి తన మీద వ్యక్తిగత ద్వేషం ఉందని, అందుకే తెగ రెచ్చిపోతున్నాడనీ వాపోయాడు!
నాకైతే కథ మీది విమర్శ సబబుగానే అనిపించింది. ఆయనెవరో కథ గురించి మాత్రమే మాట్లాడాడు. రచయిత గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. కథనే కదా బాగోలేదన్నది?!
కొంచెం కూడా అవతలి వైపు నుంచీ ఆలోచన చేయలేని వాడు కర ఎలా అయ్యాడాని ఆశ్చర్యమేసింది!
పాఠకుల ముందుకు వెళ్ళిన రచనతో రచయితలకు అనుబంధం ఉండకూడదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. పొగిడ్తలకు సంతోషించడం, తెగడ్తలకు ఒకింత బాధ పడడం మానవ సహజమే! అలాగని చప్పట్లు కొట్టిన వాళ్ళను మితృల జాబితాలో, పెదవి విరిచిన వాళ్ళను వైరి వర్గంలో చేర్చడం మాత్రం తప్పు!
'కథను విమర్శించే అర్హత అతడికెందుకు లేదు 'అని కరను అడిగితే - ఆ విమర్శకుడు ఒక్క కథైనా వ్రాసాడా, కథలు రాయకుండా కథలను ఎలా విమర్శించ గలడు అని ఒక లా పాయింటు లాగాడు.
విమర్శ అంటే 'తిట్టడం' అన్న అర్థం మాత్రమే చాలా మందికి వెంటనే స్పురిస్తుంది(అసలీ సంప్రదాయం తెలుగు వాళ్ళలో ఎలా మొదలయిందో గానీ!). విమర్శ అంటే బాగోగులను విప్పి చెప్పడమే కదా (కాపి చెబితే కవిత్వం, విప్పి చెబితే విమర్శ ... సినారే కదూ అన్నది?!). విమర్శించడంలో ఒక్కొకరికీ ఒక్కో దృక్పధం ఉండొచ్చు. అసలు ఎలాంటి దృక్పధమూ లేక పోవొచ్చు. విమర్శలు కథ, కవిత, రచనలకు పరిమితమై సహేతుకంగా సాగితే - అది రచయితలకు, పాఠకులకూ ఉపయోగకరమని అందరికీ తెలిసిందే కదా! నిర్హేతుకమైన విమర్శలు, వ్యక్తిగత దాడులు చేసే విమర్శకుల వ్రాతలకు ఏ పాటి విలువ ఉంటుందో మనకి తెలియంది కాదు.
నేనొక విషయం సూటిగా కరకు చెప్పాలనుకున్నా. సూటిగా చెబితే, మళ్ళీ నన్ను ఆ విమర్శకుడి సరసన చేర్చి, ఇంకొకరి ముందు తిట్ల పురాణం విప్పుతాడని భయమేసింది!
నేననుకున్న విషయాన్ని, కరను నొప్పించకుండా, కరకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అని కాసేపు ఆలోచించాను.
"మీరీ మధ్యన ఏమైనా సినిమాలు చూసారా?" అనడిగాను.
సంభాషణ కథ మీది నుంచీ, సినిమాల వైపు దారి మళ్ళు తుందేమిటా అని కాసింత ఆశ్చర్యపోయినట్లు కనిపించి, తానా మధ్య చూసిన సినిమా పేరు చెప్పాడు.
ఎలా వుంది అని అడిగాను.
ఏడ్చినట్లుంది అన్నాడు టకాలున.
అంత చెత్తా అనడిగాను, తెచ్చి పెట్టుకున్న ఉత్సుకతతో!
"సుత్తి కథ, డైరెక్షన్ చెత్త, ఎడిటింగ్ సరిగ్గాలేదు...మ్యూజిక్ ఘోరం...అసలా నిర్మాత ఎందుకా సిన్మా తీసాడో దేవుడికే ఎరుక" అన్నాడు.
మీరేమైనా సిన్మాలకు కథలు వ్రాసారా, దర్శకత్వం వహించారా? ఎడిటింగ్, సంగీతం, నిర్మాణం ... ఇంతకు మునుపు ఎప్పుడైనా చేసారా అని నేను అడగలేదు!
కథా విమర్శకుడికి, సినిమాను చూసి స్పందించే మామూలు ప్రేక్షకుడికి చిన్న తేడా ఉంటే ఉండొచ్చు.
"మీ కథ మీద విమర్శ వ్రాసినతను, మీ కథను సాంతం చదివి, నిశితంగా పరిశీలించే ఆ విమర్శ వ్రాసినట్లు అనిపించింది. రచనని చదివి విమర్శ రాసినందుకు అతన్ని మనం అభినందించాలి" అని చెప్పాను నవ్వుతూ!
"చదవకుండా ఎలా వ్రాస్తారు?" అడిగాడు.
గొంతులో మార్పొచ్చింది. ఇప్పుడిప్పుడే నేను సినిమా పేరుతో తనలోకి ఎక్కించిన మందు పని చేస్తున్నట్లుంది!
"ఫైళ్ళు చదవకుండా సంతకాలు చేసే ముఖమంత్రులు, ప్రజా నాయకుల గురించి మీరు వినలేదా? సమీక్షలు వ్రాయడానికి పుస్తకమంతా చదవాలా, సినిమా అంతా చూడాలా అంటూ "స్థాలీపులాక" న్యాయాన్ని ప్రతి చోటా అన్వయించాలని చూసే వాళ్ళ గురించి మీకు తెలియదా?" అని ప్రశ్నించేసరికి, బిక్క మొహం వేసాడు కర!
ఇంత జరిగాక, ముందు ముందు కథా రచయితలన్నా నాకు భయం ఏర్పడిందని వేరే చెప్పాలా?
Thursday, August 23, 2007
Tuesday, August 14, 2007
మన్మోహన్ సర్కార్ అణుగండం నుంచీ గట్టెక్కుతుందా?
లెఫ్ట్ హెచ్చరికలు లక్ష్యపెట్టక అమెరికాతో అణుబంధంలో ఎలాంటి తప్పూలేదని నొక్కి చెప్పిన మన్మోహన్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందేమోననిపిస్తోంది. మద్యంతర ఎన్నికలొస్తే భారత రాజకీయ పటం ఎలా మారుతుందో?
పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కుదుర్చుకున్న ఒప్పందమేనని ప్రజలకు నచ్చచెప్పగలమనే ఆత్మ విశ్వాసంతోనో, లేక మద్యంతరానికి తగిన సమయమిదేనన్న అంచనాతోనో, మరో ప్రత్యామ్నాయం ప్రజల ముందు లేదన్న ధీమాతోనో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ మాటల్ని పట్టించుకోవడం లేదనుకుంటా!
అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అమ్ముకుని సొమ్ముచేసుకోవడం అమెరికాకు ఎంత ముఖ్యమో, జాతి అవసరాలకు అనుగుణంగా లాభ సాటి లావాదేవీలు జరపడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అంతే ముఖ్యం! అతిముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఒడంబడికలు కుదుర్చుకునేటప్పుడు పార్టిలతో ప్రమేయం లేకుండా ప్రజా ప్రతినిధులను,మేధావులను చర్చల్లో భాగస్వాములను చేసే సంస్కృతి మొదలైతే బావుణ్ణు. ఇలాంటి సంస్కృతితో కూడా కొన్ని నష్టాలు ఉంటాయనుకోండి!
త్యాగాలతోనే అభివృద్ధి సాధ్యమనే వాదన అన్ని సార్లు ఒప్పు కాదు!

Wednesday, August 8, 2007
మొదటి విజయం (ఈ శీర్షిక నప్పదని సందేహం. కానీ ఇంకేమి పెట్టాలో తెలియలేదు)
అయిదేళ్ళ క్రితం ఒక రోజు, ఆఫీసులో ఒక అత్యవసర సమావేశం జరిగింది. చాలా ఇష్యూలు పరిష్కరించబడకుండా పేరుకుపోతున్నాయని, కస్టమర్ల దృష్టిలో ఐ.టి. అంటే దురభిప్రాయం పెరుగుతోందనీ, దాన్ని వెంటనే తగ్గించేయాలని ఒక అరగంట ఉద్బోధ చేసి బాసు ఇంకో మీటింగు ఉందంటూ వెళ్ళి పోయాడు. మమ్మల్ని ఆ మీటింగ్ రూంలోనే కూర్చుని, ఇష్యూల గురించి చర్చించి, ఒక యాక్షన్ ప్లాన్ తో తనను మళ్ళీ కలవమని చెప్పాడు.
సభ్యుల్లో నేను తప్పించి మిగిలిన వాళ్ళందరూ బాస్ మాటల్ని 'లైట్' తీసుకున్నారు.
ఆ మధ్యనే ఆ కంపెనీలో చేరిన నాకు, మేనేజర్ మాటల్లో సీరియస్నెస్ కనిపించి, మిగిలిన వాళ్ళతో సమస్యలను ప్రాధాన్య క్రమంలో వర్గీకరించి, తలా కొన్ని కేటాయించుకుని పరిష్కరిద్దామన్నాను.
'నీ తెలివి మాకు లేదా? ' అన్నట్లు నా వైపొక సారి చూసి 'సమస్యలన్నీ పరిష్కరిస్తే మన అవసరం కంపెనీకేముంటుంది. ఉద్యోగంలోంచి సాగనంపుతారు. నువ్వసలే కాంట్రాక్టరువి. మాకంటే నీకింకా నష్టం కష్టం ' అన్నారు.
నిజమేనేమోననిపించింది, వినగానే!
కానీ, సొల్యూషన్ తెలిసినా కావాలని సమస్యలను మురగపెట్టడం తప్పని పించింది. అదే విషయాన్ని వాళ్ళతో చెప్పి అప్పటికప్పుడు ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడ్డాను.
***
చాలా కంపెనీలలో - రోజు వారీ పనులకే సమయం చాలడంలేదు, ఇంక కొత్త ప్రాజెక్టులు ఎలా మొదలెడదాం అనుకుంటుంటూ ఉంటారు ఉద్యోగులు, మేనేజర్లు. సమస్యలకు తాత్కాలిక సర్దుబాట్లు చేసుకుంటూ కాలం గడుపుతుంటారు. ఉద్యోగులు ఎంత పని చేస్తున్నారు - అంటే ఎన్ని గంటలు ఆఫీసుల్లో గడుపుతున్నారు, లెక్కకు ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు (how many number of issues resolved?) అన్న మెట్రిక్స్ (metrics) మీదనే మేనేజ్మెంట్ ఆధారపడితే సమస్యలెప్పుడూ 'క్యూ ' కడుతూనే ఉంటాయి (tickets always be in queue). ఉద్యోగులు వాటిని పరిష్కరిస్తూనే ఉంటారు!
ఎన్ని గంటలు పని చేస్తున్నారని కాకుండా ఎంత efficiency తో పని చేస్తున్నారని, ఎన్ని సమస్యలు పరిష్కరించారు అని కాకుండా...అసలన్ని సమస్యలెందుకు వస్తున్నాయని మేనేజ్మెంట్ సీరియస్ గా ఆలోచిస్తే అసలు కథ అర్థమౌతుంది.
ఒక చోటునుంచీ ఇంకో చోటుకు - ఉదాహరణకు హైదరాబాద్ నుంచీ విజయవాడకు -వెళ్ళడానికి చాలా చాలా మార్గాలు అందు బాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచీ విజాగ్ విమానంలో వెళ్ళి, అక్కణ్ణుంచీ రైల్లో విజయవాడ రావొచ్చు. లేకపోతే హైదరాబాద్ లో బయల్దేరి, భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టి, విజయవాడకు చేరవచ్చు. ఇంకా చాలా విధాలుగా చుట్లు తిరిగి గమ్య స్థానానికి వెళ్ళొచ్చు.
అయితే, నేరుగా విజయవాడ వెళ్ళే మార్గాల్లో, ఒక దగ్గర దారిని ఎంచుకొని ఆ దారిన వెళ్ళొచ్చు. అదే efficiency అంటే!
***
నా ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయనిపించింది.
'సమస్యలను పరిష్కరించడానికే మనకు ఈ కంపెనీ జీతాలిస్తోంది. మనమీ సమస్యలన్నీ పరిష్కరిస్తే, ఉద్యోగాలు పోతాయనుకోవడం నమ్మశక్యంగా లేదు. ఈ పనులు efficientగా చేస్తే మనమీద customerకు నమ్మకం పెరిగి మనకు మరిన్ని ప్రాజెక్టులిస్తారు. ఇప్పుడు చేస్తున్న ఈ 'చిరిగిన బట్టలకు అతుకులు ' వేసే పనికంటే, ఇంకా మంచి పనులు చేసే అవకాశం మనకు దొరకొచ్చు. దాంతో మన స్కిల్స్ పెరుగుతాయి. Marketability పెరుగుతుంది. మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మనలాంటి రిసోర్సెస్ ను ఈ కంపెనీనే కాదు, ఏ కంపెనీకూడా వదులుకోలేదు ' అని చెప్పాను.
వాళ్ళలో నేను చెప్పిన విషయం ఎంత మందికి అర్థమైందో తెలియదు. ఒక ఇద్దరు మాత్రం నా వైపు ఆశ్చర్యంగా చూసారు, నన్ను అనుసరించారు.
***
మా టీంలో Down sizingలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, ముందనుకున్న టైంకు కాంట్రాక్టులు అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళున్నా - మూడు నెలల కాంట్రాక్టు పనికోసం వెళ్ళి - మూడేళ్ళ పాటు కాంట్రాక్టరుగా అదే కంపెనీలో ఆనందంగా పనిచేసాను!!నేనా రోజు మా టీం మేట్స్ కు మీటింగ్ రూంలో ఏమైతే చెప్పానో, వాటినే ఇప్పటికీ ఆచరిస్తున్నాను.
[ ఈ టపా చదివేవారు Efficiency, Principles అన్న పదాలకు సమానమైన మంచి తెలుగు పదాలేమైన తెలిస్తే తెలియజేయగలరా? - కృతజ్ఞతలు. ]

Monday, August 6, 2007
మొదటి అడుగే ముఖ్యం!
నేను చాలా మందిని చూసాను.
మీరు కూడా చూసే ఉంటారు.
వర్క్ స్కిల్స్ లో, కష్టపడే తత్వంలో, ఆలోచించే పద్ధతుల్లో, మాట్లాడ్డంలో మనకంటే బాగా వెనకబడ్డట్లు అనిపించే వాళ్ళను మనం చాలా మందిని చూసుంటాం. చాలా మంది మనకంటే వెనకబడ్డట్లు కనిపించడంలో కొంత వరకు మాత్రం 'కాకి పిల్ల కాకికి ముద్దు ' (కాపికాము) సిండ్రోం పని చేయవచ్చు.
గత పదిహేనేళ్ళలో నాకు తారసపడిన వాళ్ళను, తారసపడిన వాళ్ళలో నేను సన్నిహితంగా గమనించిన కొందరి గురించి నేనొక మాట చెబుదామనుకుంటున్నాను.
ఏ కంపెనీలో చేరినా, మూడు నుంచీ ఆరు నెలల లోపే పింక్ స్లిప్పులు తీసుకుని బయట పడ్డ వాళ్ళు, మళ్ళీ ఉద్యోగాలు దొరక్క 'బెంచ్ 'ల మీద నెలలకు నెలలు ఎదురు చూసిన వాళ్ళు నాకు తెలుసు. మీకూ తెలిసి ఉండొచ్చు!
వాళ్ళలా ఉద్యోగాల కోసం వెదుక్కుంటూ నిరాశా నిస్పృహలతో వేగలేని కొన్ని వేళల్లో మనం ధైర్యం చెప్పి ఉంటాం. చేతనైన సాయం చెయ్యడానికి చెయ్యందించి ఉంటాం. స్నేహితులుగా ఆ బాధ్యతలు నిర్వర్తించాక, సాటి మనుషులుగా - వారి కంటే మనం చాలా వీరులమని, శూరులమని, విజ్ఞాన దురంధులమని ఉప్పొంగి పోయుంటాం, సహజంగానే!
గొర్రె తోక బెత్తెడు ఉద్యోగాలు ఎన్నాళ్ళు చేస్తాం...ఏదైనా సొంత వ్యాపారం మొదలెట్టొచ్చుగా అన్న ఆలోచన రాగానే [మనకో, మన సాన్నిధ్యంలో మన సహచరులకో] వ్యాపారానికి అనుభవం కావాలని, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడ్డం, ఆంగ్లం అందంగా వ్రాయడం తెలిసి ఉండాలని, మంచి భాగస్వాములుండాలనీ...ఇంకా ఏవేవో లక్షణాలుండాలని అనుకుని, ఆ ఆలోచనలను మొగ్గలోనే తుంపి ఉండవచ్చు.
ఉద్యోగాలు రాక విసుగెత్తి, బతకడం [సర్వైవల్]కోసం చిన్న చిన్న వ్యాపారాలు మొదలెట్టి, క్రొత్త క్రొత్త అనుభవాలు సంపాదిస్తూ...వ్యాపారాలను పెంచుకుంటూ, ఇంకొంత మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న అప్పటి స్నేహితులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది కదూ! వాళ్ళా స్థాయికి వచ్చారన్న సంగతి నమ్మశక్యంగా ఉండదు.
నిజానికి కష్టపడకుండా, ఎలాంటి ప్రత్యేకమైన ప్రతిభ లేకుండా వాళ్ళా స్థాయికి వచ్చి ఉండరు. వాళ్ళు పడే కష్టాలను, వాళ్ళకున్న ప్రత్యేక ప్రతిభ గురించి ప్రస్తుతానికి ప్రక్కన పెట్టి...వాళ్ళకు మనకు ఉన్న ఒక పెద్ద తేడాను గురించి ఆలోచించినపుడు - వాళ్ళు మొదటి అడుగు వేయడానికి భయఫడని వారనిపించింది!
మనం చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూనే ఉన్నాం. హాయిగానే ఉంటాం. కానీ మొదటి అడుగు వేయడానికి భయపడతాం!
బహుశా comfort zone లో ఉండే చాలా మంది మనలాగే ఉంటారేమో!!

Subscribe to:
Posts (Atom)