ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు పిల్లల కథల పుస్తకాలు కొన్ని తెచ్చాను. వాటిలోంచీ మా అబ్బాయికి రోజు రాత్రి పడుకునే ముందు ఒక కథ (ఒక్కో రోజు - రోజంతా తక్కువ అల్లరి చేస్తే బోనస్ గా రెండో కథ) చదివి వినిపిస్తున్నాను.
వాడు చాలా ఆసక్తిగా వింటున్నాడు. కథ చెప్పనేమోనన్న భయంతో అల్లరి కూడా తగ్గిస్తున్నాడు. కథ మధ్యలోనో, కథ అయిపోయాకో చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతున్నాను. వాటికి వాడు చాలా వరకు మంచి సమాధానాలే ఇస్తున్నాడు.
కానీ, వాడు అప్పుడప్పుడూ అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వడం నాక్కొంచెం కష్టంగా ఉంటోంది.
ఉదాహరణలు -
1. 'నక్క తెలివిగా కాకిని పాడమని అడిగింది' అని చదవగానే, 'తెలివి'అంటే ఏమిటి అని ప్రశ్న. నాలుగేళ్ళ పిల్లలకు (మా అబ్బాయి వయసు నాలుగు కంటే తక్కువే) తెలివి అంటే ఏమిటో, వాళ్ళకు తెలిసిన పదాల్లో, ఉదాహరణలతో ఎలా చెప్పాలి?
2. 'నక్క కాకిని మోసం చేసింది' అన్న దాన్లో 'మోసం'అంటే ఏమిటి అని అడిగాడు. ఎలా సమాధానమివ్వొచ్చు?
3. 'మొసలి, కోతిని చంపి తినాలనుకుంది' లో - చంపి - లేక చంపడం అన్న దాని గురించి ఎలా చెప్పొచ్చు?
వాడు కథలు ఫాలో కావడం గమనిస్తే - వాడి వయసుకు మించిన పుస్తకాలు (కథలు) చదువుతున్నానేమోనన్న సందేహం రావడం లేదు.
ఇలాంటి చిన్న చిన్న పదాలకు క్లుప్తంగా, ఆసక్తికరంగా అర్ధాలు చెపితే, పిల్లల పదజాలం పెరుగుతుందని నమ్మకం!
Thursday, September 4, 2008
Subscribe to:
Post Comments (Atom)


9 comments:
పెద్ద ప్రశ్నలే వేశాడు మీ అబ్బాయి, నాకు చిన్నప్పుడు ఇలాంటి డౌట్స్ రాలేదేంటబ్బా?? పువ్వు పుట్టగానే పరిమళించి మోసంలాంటి పదాలకి అర్థాలు intuitive గా తెలిసిపోయుంటాయ్ :డ్
మీ పిల్లలతో మీరు పడే పాట్లు నేను కూడా మా పిల్లలతో పడుతుంటాను. చందమామని ఆకాశంలో ఎవరు పెట్టారు. నక్షత్రాలు అలా పడిపోకుండా ఎందుకున్నాయి? భూమి గ్రుంద్రంగా ఉంటే కింద వున్నవాల్లు పడిపోకుండా ఎలా వున్నారు (గూగుల్ ఎర్త్ చూపించినప్పుడు) ఈ ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక జుట్టు పీక్కున్న సందర్భాలు చాలా వున్నాయి. ఓపికగా సమాధానం చెప్పి కన్విన్స్ చేయడం తప్ప కోప్పడి, బెదిరించి వారిలో వున్న ప్రశ్నించే తత్వాన్ని చిదిమేయకూడదు.
ఏమండీ, మీరు మరీనూ ..
మిమ్మల్ని మీ రచనల్ని ఆలోచనల్ని ఈ బ్లాగ్లోకంలో ఏడాది పైగా గమనిస్తున్నాను. తెలివికీ మోసానికీ మీ బాబుకి అర్ధమయ్యే ఉదాహరణలు మీరే కచ్చితంగా ఆలోచించుకోగలరు.
ఇక వయసుకి తగిన కథలా .. అని. మన చిన్న వయసులో విని చదివి జీర్ణం చేసుకున్న ఎన్నో కథలు (ముఖ్యంగా మన పురాణ, మత సంబంధ కథలు) అమెరికాలో age-inappropriate గా పరిగణిస్తారు. వేట, చంపి తినడం అనేవి కొంచెం గ్రామీణ జీవితాలకి దగ్గర్లో ఉండే అమెరికన్ పిల్లలకి అనుభవమే గానీ, మనలాగా అర్బన్ ప్రొఫెషనల్ నేపథ్యంలో బతికే వారికి గబుక్కున ఊహకందవు. వేటాడే మృగాల గురించి చిన్న ఉపోద్ఘాతం చెబితే బాబుకి అర్ధమవుతుందనే నేను అనుకుంటున్నా.
voohaatmaka kathalani vinatam dvaaraa vaani medaduku pani perugutumdi. daanito vaadi buddhi vikasistumdi. annitiki samaadhaananm ardham cheppi vaanikekkimchaalamte adi kathakaadu paatamavutumdi. vaani voohaalokaallo vaanni viharimchanivvamdi. konni vayasuvachchaaka vaade telusukumtaadu. meeru maree ekkuvagaa vaanni vignaanavamtunni cheyyaalani tapana padakamdi.
ఇలా ప్రశ్నించే పిల్లలకు వాళ్లకు అర్థమయ్యేరీతిలో మనం సమాధానం చెప్పగలిగితే భవిష్యత్తులో మంచి విజ్ఞానవంతులవుతారనే దానికి సందేహమేమీ లేదు.వాళ్ళకిచ్చే సమాధానమే మన సమర్థతకు పెద్ద పరీక్ష.ఎందుకంటే ఇది నాకు 16 సం.క్రింద మా అబ్బాయితో అనుభవం.
మావాడికి 3.4 ఏళ్ళు. కొన్ని చందమామ కధలు, కొన్ని ఇంగ్లీషు కధలు చెప్తుంటాం. Snow White and 7 dwarfs కధలో Queen జెలసీ తో Snow White ని అడవికి పంపించి చంపించటానికి ప్లాన్ చేస్తుంది. అది విని వాడు జెలసి అంటె ఏంటి అంటాడు. ఇంకేదో కధలో Spirit అంటే ఏంటి అని అడుగుతాడు. ఏదో చెప్పటమే.
@ భాస్కర్ రామరాజు
ఏదో చెప్పెయ్యెడం కాదండి సరిఅయిన సమాధానాన్నే వారి మేధస్సుకు తగిన విధంగా చెప్పాలి. ఇది ఒక రకంగా మన మెదడుకు కూడా మేతలాంటిదే.
అందరికీ కృతజ్ఞతలు.
వాడడిగిన ప్రశ్నలకు సరైన, సహేతుకమైన జవాబులివ్వాలని తపన. ఏదో ఒకటి చెప్పాలంటే మనసొప్పదు, ఎందుకంటే అది నాకూ...ముఖ్యంగా పిల్లవాడికి చాలా నష్టం కలిగిస్తుంది కదా!
మా తాతగారు నెను 3 ఏల్ల వయసు లో ఉండగా ఇలాంటి ప్రశ్నలతోనే విసిగించే వాడిని అప్పట్లో నాకు ఇవి ధర్మ సందేహల్లాగనే అనిపించేవి.. అప్పుడు మా నాన్న గారు అవి చూసి అశ్చర్య పోయే వాడంట. సిరి గారు దీనికి ఒక్కటే పరిష్కారం.
Learning by example
అంటే మీ పిల్లవాడికి ఎదురు పడ్డ చిన్న చిన్న ఉదహరణలు, సంఘటణలు చూపండి (కాని ఎత్తి చూపకండి).
Post a Comment