ఎప్పుడో వచ్చిన సినిమా గురించి, ఇప్పుడేమిటీ టపా...అంటే, ఎప్పుడో వ్రాసుకున్న నోట్సు కొంత...ఇప్పుడు బయటపడ్డం. ప్రస్తుతం నా దగ్గర DVD ఉన్నా, అది పని చేయడం లేదు. అంచేత, మరో సారి క్రాస్ చెక్ చేసుకునే అవకాశం నాకు దొరకలేదు, ప్రస్తుతానికి.
***
సినిమాలో నాకు నచ్చినవి:
ఒక పాయింట్ తీసుకొని, చివరికంటా తీసుకెళ్ళడం. నానా సొల్లుతో 'రీళ్ళ' యాపన చేయకుండా, సరాసరి తనయుడికి తండ్రికి జరిగే ఘర్షణలోకి దూకేయడం. అలాగే పాత్రల పరిచయం క్లుప్తంగా, సూటిగా చేయడం. చిత్రమంతటా పరుచుకున్న సున్నితమైన హాస్యం. ఒక్కసారి ప్రేక్షకులను కుదిపే చివరి సన్నివేశం.
అలా అని సినిమా పిచ్చగా నచ్చేసిందా? లేదు. మరలా అసంతృప్తే [అని విని ఫ్రెండొకరు -నీకు నచ్చిన సినిమా ఎవరూ తీయలేరు గానీ, నువ్వే వొకటి తీసుకుని నువ్వే చూసుకో - అన్నారు చేతిలోని బొమ్మరిల్లు DVD డబ్బాను నేలకేసి కొట్టి :-)]
మంచి పాయింటును చెప్పడానికి, సమకాలీన పాత్రలను తీసుకుని, శ్రద్దగా కథ నడుపుకోక - మధ్యమధ్యలో కిట్టింపులెందుకు? అవీ కథకు కీలకమైన సందర్భాలలో?!
ఇక్కడొక చిన్న ఫ్లాష్ బేక్ - చదువుకునే రోజుల్లో, ప్రయోగ శాలల్లో - ప్రయోగాలు చేసేప్పుడు, మన యోగం బాగోలేక, యాగం బాగా నడవక - రావలసిన ఫలితం రాలేదనుకోండి. ఏమి చేస్తాం?! రావల్సిన ఫలితానికి దగ్గరగా మనకొచ్చిన రిజల్ట్ ను "కిట్టించే"స్తాం. అసలు జవాబు 50 అయితే, మనకు 20 వచ్చింది. దాన్ని, 49.99 కి దగ్గరగా తీసుకెళ్ళి, మనకు అదే వచ్చిందని వ్రాసి ఇవ్వడాన్నే (గాంధీలు మాత్రం అలా ఇవ్వరు) కిట్టించడం అంటాం! సరే మళ్ళీ బొమ్మరిల్లుకు వద్దాం.
ఒకటో కిట్టింపు - సిద్దు తల్లితో మాట్లాడుతూ, నాకేమైనా కష్టమొస్తే నువ్వున్నావుగా అంటాడు. తల్లితో పాటు ప్రేక్షకులకూ (అందరికీ కాకున్నా కొందరికైనా) ఇదేవిటీ అసందర్భ ప్రేలాపన అనిపిస్తుంది.
రెండు - హాసిని తో సిద్దు మనసులో మాట చెప్పడానికి కలిసినప్పుడు, తనకు అంతకు ముందే నిశ్చితార్థమైన అమ్మాయి వైపు తిరిగి (హాసిని ఉత్తరం వైపుంటే, సుబ్బలక్ష్మి దక్షిణం వైపుంటుంది) - మీరు చాలా బాగున్నారు. ఐ లవ్యూ - అని చెబుతడు. ఇది పెద్ద కిట్టింపు. అంటే 50 రావాల్సిన చోట 5 వస్తే, దాన్ని 46.72 గా మార్చడం లాంటిది!
మూడోడి - గుళ్ళో పెళ్ళికి ధర్మవరపు బఫూన్ వేషంలో రావడం, గంతులేయడం. పెళ్ళి సంబరం మధ్యలోకి కోట శ్రీనివాసరావు రావడం!
(మిగతాది మరో టపాలో)
Tuesday, September 9, 2008
Subscribe to:
Post Comments (Atom)


5 comments:
హమ్మయ్య .. ఈ యెదవ సినిమా బాలేదని ఫీలైన వాళ్ళు ఈ భూప్రపంచంలో కనీసం ఇంకోళ్ళున్నారన్న మాట.
నాకు ఈ సినిమా చూసినంత సేపూ కారం రాచుకున్నట్టు చిరచిరలాడుతూనే ఉంది.
అవునూ, జనాలు ఎందుకంత ఎగ్జైటైపోతారు, వాళ్ళకి నచ్చిన సినిమాని మనం కూడా మెచ్చకపోతే?
ప్రయోగాల యోగాల యాగాలు, కిట్టింపు నిర్వచనాలూ భలేగా చెప్పారు.
ఇంతకీ మీరు సిరి నా, అతిథి నా?
Agreed with the third one!
భలే వాళ్ళే..చాలా మందే ఉన్నారండీ. ఈ సినిమా అందరూ అంత గొప్ప సినిమా ఏం కాదూ అని అనుకున్నవాళ్ళు.
నేను మరీ చిరాగ్గా ఏం ఫీల్ అవ్వకపోయినా "THE perfect one" అని అందరూ అంటుంటే, idlebrain లో 5/5 రేటింగ్ ఇస్తే, బుర్ర బద్దలు కొట్టుకున్నా. వాదించి ఓపిక లేక వదిలేసా..
ఇదే కాదండి ఈ మధ్యన చాలా సినిమాలు చాల ఓవర్ రేటెడ్ అని నాకనిపిస్తుంది. అలాంటి వాటిల్లో 'పోకిరీ' కూడా వుంది నా లిస్టులో.
'చుక్కల్లో చంద్రుడు' అని ఓ ఫ్లాప్ సినిమా ఉంది - సిద్ధార్ధదే. బొమ్మరిల్లుకన్నా ఇది బాగా నచ్చింది నాకు.
'పోకిరి' అంత పెద్ద హిట్ అవ్వటం వింతే. దానికన్నా 'అతడు' బాగుంటుంది.
Movie has dealt with a smooth topic which prevails in the existing society. It pushed several parents introspect themselves.
When one is a keen observant he can search/find negatives in any creation :)
Post a Comment